ఎవరేమి అంటున్న (మమకారమన్నది లేనింటికీ) సాంగ్ లిరిక్స్ విశాల్ మగ మహారాజు (2015) తెలుగు సినిమాAlbum : Vishal's Maga Maharaju


Starring: Vishal, Vaibhav, Santhanam, Hansika, Kiran Rathod, Nyra Banerjee
Music : Hiphop Tamizha
Lyrics-Vennelakanti 
Singers :Kutle Khan, Palakattu Sriram,Sooraj Santhosh, Mukesh 
Producer: Vishal
Director: Sundar C
Year: 2015


Get This Song In English Script Lyrics CLICK HEREఎవరేమి అంటున్న (మమకారమన్నది లేనింటికీ) సాంగ్ లిరిక్స్


నేల మీద ఓ ఓ దేవతలై దేవతలై
చిరునవ్వులతో మమ్ము దీవించండి దీవించండి
నింగిలోన నింగిలోన కోటి తారకలై
కొత్త కాంతులతో మాలో జీవించండి

మకరందంలో లేని ఆ మాధుర్యం అంతా
మన బంధంలో కన్నా నే ధన్యున్ననుకున్నా
గుండెల్లో చెమ్మే గుండెల్లో చెమ్మే కళ్ళల్లో చిమ్మే ఓ కళ్ళల్లో చిమ్మే
పండంటి జన్మే పండంటి జన్నే రాశాడు బ్రమ్మే రాశాడు బ్రమ్మే

ఎవరేమి అంటున్న ఎవరేమి చేస్తున్న అనుబంధమేనాడు తీరనిది
నేనున్న ఈ రోజు.. నే లేని ఆ రోజు అనురాగం అనురాగం తియ్యనిది
మా గుండెల గుడిలోన కొలువున్నది నీవెలే
నీ కన్నుల నిదురించే కలలన్నీ మాకెలే
ఓ ఓ ఓ ఓ ఓఓఓ ఓ ఓ

మమకారమన్నది లేనింటికీ మా లక్ష్మి ఏనాడు రానేరాదు
ఆప్యాయత అన్నది లేని నాడు ఆ మనిషి బతుకసలు బతుకే కాదు
విడిపోయి కూడే వేళ భారాలే తీరేను దూరాన నావే నాడో తీరాన్ని చేరేను

ఇంకొక జన్మంటూ ఆ దేవుడు నాకిస్తే
మళ్ళీ ఈ బంధం నాకిమ్మని వరమడిగేస్తా
ఎవరేమి అంటున్న ఎవరేమి చేస్తున్న అనుబంధమేనాడు తీరనిది
నేనున్న ఈ రోజు.. నే లేని ఆ రోజు అనురాగం అనురాగం తియ్యనిది

సంతోషం సంతాపం ఏమొచ్చినా గాని సంతోషం మాత్రం మేం పంచుకుంటాం
దేవుల్లలా మీరు మా కళ్ళ ముందుంటే సేవకులై సేవ చేసుకుంటాం
చెట్టుని రాయెత్తి కొడితే తీయని పల్లివ్వదా
పుడమిని గుండెల్లో కొలువ పుత్తడి సిరులివ్వదా

ఇంకో లోకంలో నేనుండే నాడైనా
మళ్లీ ఈ ఇంట్లో పుట్టే వరమడిగేస్తా
ఎవరేమి అంటున్న ఎవరేమి చేస్తున్న అనుబంధమేనాడు తీరనిది
నేనున్న ఈ రోజు.. నే లేని ఆ రోజు అనురాగం అనురాగం తియ్యనిది
మా గుండెల గుడిలోన కొలువున్నది నీవెలే
నీ కన్నుల నిదురించే కలలన్నీ మాకెలే
ఓ ఓ ఓ ఓ ఓఓఓ ఓ ఓ
Share This :sentiment_satisfied Emoticon