ఏగిల్లు వారింది కోదండ రామయ్య సాంగ్ లిరిక్స్ శ్రీరామ నవమి పాటలు (2020) శ్రీరాముడు | భక్తి | Aarde Lyrics

Album : Sri Rama Navami Songs [Devotional]


Starring: Shirisha
Music : Praveen Kaithoju
Lyrics-Pothaveni Gangaram Goud 
Singers :Shirisha
Producer: N/A
Director: N/A
Year: 2020


English Script Lyrics Click HEre




ఏగిల్లు వారింది కోదండ రామయ్య సాంగ్ లిరిక్స్


ఏగిల్లు వారింది కోదండ రామయ్య.. 
ఎల్లేమే లేవయ్య సీతమ్మ తోడయ్యా..
ఎర్రాటెండాకాలం మబ్బూల లేవయ్య 
సల్లా గోదావరిలో తానాలు చేయవయ్యా
ఏగిల్లు వారింది కోదండ రామయ్య..
ఎల్లేమే లేవయ్య సీతమ్మ తోడయ్యా..
పచ్చా ఉంగరము నీకు పయిలంగా తొడిగితినయ్యా 
అల్లీ పూదండా నీకు అల్లితినయ్యా
సిలకా కొట్టిన పండ్లు.. సిరినవ్వుతో తినవయ్యా
టేకు దోనెల పట్టు తేనెలు తాగవయ్య..
ఏగిల్లు వారింది కోదండ రామయ్య..
ఎల్లేమే లేవయ్య సీతమ్మ తోడయ్యా..

హొయ్యారే హొయ్ హొయ్.. హొయ్యారే హొయ్ హొయ్ హొయ్ హొయ్యారే..
అడివమ్మా ఒడిలాకెళ్ళి.. ఇప్పా పువ్వు తెస్తినయ్యా
గోదారి నీళ్ళ తోని.. పాదాలు కడిగామయ్య
అమ్మా సీతమ్మతో పుట్టిలో కూసోవయ్య
పసుపు తాళి కట్టీ ఏలుకోరావయ్య

ఏగిల్లు వారింది కోదండ రామయ్య..
ఎల్లేమే లేవయ్య సీతమ్మ తోడయ్యా..
రామయ్యా భద్రాచల రామయ్యా
హనుమయ్య తీరు నిన్నూ కొలుచుకుంటానయ్య
లచుమయ్య తీరు వెంట అంటి ఉంటామయ్య..
రామదాసు తీరు నీ పాటనైతానయ్య
అయ్యా నీ గుడికి రాతి ముగురామునైతానయ్య

ఏగిల్లు వారింది కోదండ రామయ్య..
ఎల్లేమే లేవయ్య సీతమ్మ తోడయ్యా..
ఈ తీరం నుండి నిన్ను ఆ తీరం చేర్చేనయ్యా..
నా తీరం చేరే దారి మాకింకా చూపవయ్యా
శరణని మొక్కిన చాలు.. పరుగున రావేమయ్యా
బతుకంతా తోడుగా నిలిచి వెతలన్నీ బాపమయ్యా..
ఏగిల్లు వారింది కోదండ రామయ్య.. 
ఎల్లేమే లేవయ్య సీతమ్మ తోడయ్యా..
ఎర్రాటెండాకాలం మబ్బూల లేవయ్య 
సల్లా గోదావరిలో తానాలు చేయవయ్యా
ల ల ల ల  ల ల ల ల ల ల ల ల ల
తానానే తానేనానే తననానే తానేనానే
Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)