వయ్యారమొలికే చిన్నదీ సాంగ్ లిరిక్స్ మంగమ్మ శపధం (1965) తెలుగు సినిమా | Aarde LyricsAlbum : Mangamma Sapatham


Starring: N. T. Rama RaoJamuna
Music : T. V. Raju
Lyrics-C. Narayana Reddy
Producer: D. V. S. Raju
Director: B. Vittalacharya
Year: 1965


English Script Lyrics Click Here


వయ్యారమొలికే చిన్నదీ సాంగ్ లిరిక్స్


ఓ.. ఓ.. ఓ..


వయ్యార మొలికే చిన్నదీ.. ఉడికించుచున్నదీ
రమ్మంటే రాను పొమ్మన్నది..
ఆ.. ఆ.. ఆ..
సయ్యాటలాడే ఓ దొరా.. సరసాలు మానరా
కవ్వింతలేల ఇక చాలురా...

ఇంతలోనే ఏ వింత నీలో.. అంత తొందర కలిగించెను

చెంత నిలిచిన చిన్నారి చూపే.. అంతగా నన్ను కవ్వించెను
మనసే చలించెను.. అనురాగ వీణ పలికించెను

ఆ.. ఆ.. ఆ..

సయ్యాటలాడే ఓ దొరా.. సరసాలు మానరా
కవ్వింతలేల ఇక చాలురా...

హొయలు చిలికే నీ కళ్ళలోని.. ఓర చూపులు ఏమన్నవి

నగవు లొలికే నా రాజులోని.. సొగసులన్ని నావన్నవి
తలపే ఫలించెను.. తొలి ప్రేమ నేడు చిగురించెను

ఓ.. ఓ.. ఓ..

వయ్యారమొలికే చిన్నదీ.. ఉడికించుచున్నదీ
రమ్మంటే రాను పొమ్మన్నది..Share This :sentiment_satisfied Emoticon