ఏమో ఏమో ఇది సాంగ్ లిరిక్స్ అగ్గి పిడుగు (1964) తెలుగు సినిమా | Aarde Lyrics

Album : Aggi Pidugu


Music : Rajan Nagendra
Singers :Ghantasala, S. Janaki 
Producer: B. Vittalacharya
Director: B. Vittalacharya
Year: 1964

English Script Lyrics Click Here 
ఏమో ఏమో ఇది సాంగ్ లిరిక్స్ 
ఏమో ఏమో ఇది... నాకేమో ఏమో అయినది
ఏమో ఏమో ఇది... నాకేమో ఏమో అయినది
ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులౌతున్నది

ఏమో ఏమో అది... నీకేమి ఏమి అయినది
ఈ వేళలో నీ గుండెలో ఎందుకు గుబులౌతున్నది
హాయ్...
ఏమో ఏమో ఇది... నాకేమో ఏమో అయినది

కనులలో నీ కనులలో.. నా కలలే పొంగినవీ
కురులలో ముంగురులలో.. నా కోరికలూగినవీ
ఆహ.. ఆహ... ఆ..
వింతగా కవ్వింతగా ఈ వెన్నెల పూచినదీ 
చెంతగా నువు చేరగా గిలిగింతగ తోచినది.. గిలిగింతగ తోచినది
ఏమో ఏమో ఇది... నాకేమో ఏమో అయినది
ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులౌతున్నది
ఏమో ఏమో ఇది... నాకేమో ఏమో అయినది

ఎందుకో సిగ్గెందుకో నా అందాలబొమ్మకు
అందుకో చేయందుకో మరి ఆవైపు చూడకు
ఆహ.. ఒహో.. ఆ..
నవ్వుతో ముసినవ్వుతో హోయ్.. నను దోచివేయకు
మాటతో సయ్యాటతో నను మంత్రించివేయకు.. మంత్రించివేయకు

ఏమో ఏమో ఇది... నాకేమో ఏమో అయినది
ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులౌతున్నది
ఆహ... ఆహ... ఆహ... అహ...
ఊహూహు.. హూ..హుహు.. 
Share This :sentiment_satisfied Emoticon