కన్నులతో పలుకరించు సాంగ్ లిరిక్స్ పెళ్ళికానుక (1960) తెలుగు సినిమా | Aarde Lyrics




Album : Pelli Kanuka

Starring:Akkineni Nageswara Rao, Krishna Kumari, B. Saroja Devi
Music :A. M. Rajah
Lyrics-Aatreya
Singers :MM Raja, Suseela
Producer:S. Krishna Murthy, T. Govindarajan, Sridhar
Director:C. V. Sridhar
Year: 1960

English SCRIPT LYRICS CLICK HERE




కన్నులతో పలుకరించు సాంగ్ లిరిక్స్



కన్నులతో పలుకరించు వలపులు
ఎన్నటికి మరువరాని తలపులు
కన్నులతో పలుకరించు వలపులు
ఎన్నటికి మరువరాని తలపులు
రెండు ఏకమై ఒహొ ...ప్రేమే లోకమై అహా
నామది పాడే పరాధీనమై ...అలాగా
కన్నులతో పలుకరించు వలపులు
ఎన్నటికి మరువరాని తలపులు

చల్లని వేళ మల్లెల నీడ చక్కని దొంగ దాగెనట
చల్లని వేళ మల్లెల నీడ చక్కని దొంగ దాగెనట
దారులకాచి.. సమయము చూచి ..దాచిన ప్రేమ దోచెనట
మరలా వచ్చెను... మనసే ఇచ్చెను
మరలా వచ్చెను... మనసే ఇచ్చెను
అతనే నీవైతే.. ఆమే నేనట ...నిజంగా ఉం ఉం
కన్నులతో పలుకరించు వలపులు
ఎన్నటికి మరువరాని తలపులు

నల్లని మేఘం మెల్లగ రాగ ...
నాట్యము నెమలి చేసినది
నల్లని మేఘం మెల్లగ రాగ... 
నాట్యము నెమలి చేసినది
వలచినవాడు సరసకురాగ ఎంతో సిగ్గు వేసినది ...
తనివితీరా తనలో తానే...
తనివితీరా తనలో తానే... 
మనసే మురిసింది పరవశమొందగా... ఐ సీ

కన్నులతో పలుకరించు వలపులు
ఎన్నటికి మరువరాని తలపులు
రెండు ఏకమై ...ప్రేమే లోకమై ...
నా మది పాడే పరాధీనమై ...
కన్నులతో పలుకరించు వలపులు ...
ఎన్నటికి మరువరాని తలపులు..
Share This :



sentiment_satisfied Emoticon