ఆకాశ వీధిలో అందాల జాబిలీ సాంగ్ లిరిక్స్ మాంగల్య బలం (1959) తెలుగు సినిమా | Aarde Lyrics



Album : Mangalya Balam


Starring: ANRSavitri
Music : Master Venu
Lyrics-Sri Sri
Producer: D. Madhusudhana Rao
Director: Adurthi Subba Rao
Year: 1959

English Script Lyrics Click Here



ఆకాశ వీధిలో అందాల జాబిలీ సాంగ్ లిరిక్స్ 



ఆకాశ వీధిలో అందాల జాబిలీ
వయ్యారి తారను జేరి
ఉయ్యాలలూగెనే సయ్యాటలాడెనే
ఆకాశ వీధిలో అందాల జాబిలీ
వయ్యారి తారను జేరి
ఉయ్యాలలూగెనే సయ్యాటలాడెనే

ఆకాశ వీధిలో అందాల జాబిలీ
వయ్యారి తారను జేరి
ఉయ్యాలలూగెనే సయ్యాటలాడెనే

జలతారు మేలిమబ్బు
పరదాలు నేసీ తెరచాటు చేసీ
పలుమారు దాగి దాగి
పంతాలు పోయీ పందాలు వేసీ
అందాల చందామామ
దొంగాటలాడెనే దోబూచులాడెనే

ఆకాశ వీధిలో అందాల జాబిలీ
వయ్యారి తారను జేరి
ఉయ్యాలలూగెనే సయ్యాటలాడెనే

జడివాన హోరుగాలి
సుడిరేగి రానీ జడిపించబోని
కలకాలము నీవే నేనని
పలుబాసలాడీ చెలి చెంత చేరీ
అందాల చందామామ
అనురాగం చాటెనే నయగారం చేసెనే

ఆకాశ వీధిలో అందాల జాబిలీ
వయ్యారి తారను జేరి
ఉయ్యాలలూగెనే సయ్యాటలాడెనే 




Share This :



sentiment_satisfied Emoticon