చిన్నా చిరు చిరు నవ్వుల చిన్నా సాంగ్ లిరిక్స్ ప్రియరాగాలు(1997) | తెలుగు సినిమా | Aarde Lyrics


Album : Priyaragalu


Starring: Jagapati Babu, Soundarya ,Maheswari
Music : M. M. Keeravani
Lyrics- Sirivennela
Singers : Chitra
Producer: Sunkara Madhu Murali
Director: A. Kodandarami Reddy
Year: 1997


English Script Lyrics Click Here

చిన్నా చిరు చిరు నవ్వుల చిన్నా సాంగ్ లిరిక్స్



చిన్నా చిరు చిరు నవ్వుల చిన్నా
కన్నా చిట్టి పొట్టి చిందులు కన్నా
నా ప్రేమ పోతపోసి కన్నానురా
నిను శ్రీరామ రక్షలాగ కాపాడగా
నీలో ఉన్నా.. నీతో ఉన్నా.. చిన్నా...

అటు చూడు అందాల రామచిలకనీ
చూస్తోంది నిన్నేదో అడుగుదామనీ
నీ పలుకు తనకి నేర్పవా అనీ
ఇటు చూడు చిన్నారి లేడిపిల్లనీ
పడుతోంది లేస్తొంది ఎందుకోమరీ
నీలాగ పరుగు చూపుదామనీ
కరిగిపోని నా తీపి కలలనీ
తిరిగిరాని నా చిన్నతనమునీ
నీ రూపంలో చూస్తూ ఉన్నా

చిన్నా చిరు చిరు నవ్వుల చిన్నా
కన్నా చిట్టి పొట్టి చిందులు కన్నా 

తూనీగ నీలాగ ఎగరలేదురా
ఆ తువ్వాయి నీలాగ గెంతలేదురా
ఈ పరుగు ఇంక ఎంతసేపురా
ఈ ఆట ఈ పూట ఇంక చాలురా
నా గారాల మారాజ కాస్త ఆగరా
నీ వెంట నేను సాగలేనురా
ఎంతవెతికినా దొరకనంతగా
ఎంత పిలిచినా పలకనంతగా
వెళ్ళిపోకమ్మా..రారా కన్నా

చిన్నా చిరు చిరు నవ్వుల చిన్నా
కన్నా చిట్టి పొట్టి చిందులు కన్నా
నా ప్రేమ పోతపోసి కన్నానురా
నిను శ్రీరామ రక్షలాగ కాపాడగా
నీలో ఉన్నా.. నీతో ఉన్నా..


Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)