Album : Manmadhudu 2
Starring: Nagarjuna, Rakul Preet
Music : Chaitan Bharadwaj
Lyrics-Subham Viswanath
Singers :Chinmayi Sripada
Producer: Annapurna Studios
Director: Rahul Ravindran
Year: 2019
English Script Lyrics CLICK HERE
నాలోనా.. నీవేనా.. ప్రేమై నేడు పూచేనా
నా పెదవుల్లో పాటై
ఎదలో నిన్ను చేసింది .. పదిలం
నిన్నే చూస్తూ కరిగిందిలే.. కాలం
పగలే వెన్నెలయింది భువనం,
కలలే మర్చి చూస్తోంది నయనం
నీలో కలిసి రానంది నా ప్రాణం
ప్రేమా..
ఈ వింత కొత్తగుందిలే.. నాలో
నీ జతలో.. ఈ వేళా
ప్రేమా ..
ఈ హాయి పొంగుతోందిలే.. నాలో
నా జతకై.. రావెల
నువ్వేలేని హృదయాల.. ప్రళయం
నీతో రాని జన్మింక.. నరకం
నీకై అడుగులేస్తోంది.. నా పాదం
పరువం ఉరకలేస్తున్న.. తరుణం
ఆహ చెప్పలేనంత.. మధురం
మనసా చేసి పోవద్దులే.. గాయం
నీలాంబరమే.. వాలే నీ కళ్ళలో..
తారలే నిన్ను వర్ణించగా
కుంకుమ పువ్వై విరిసే.. ఎద నందనం
వెన్నెలై నువ్వు వర్షించగా
పరిమలమవదా.. నిను తాకే గాలి
ఎదలయ వినవా.. శ్వాసే నీవై
పగడపు కలవ.. నిను చేరే దారి
పదముల కెరుక .. తోడై రావా
నాలోనా.. నీవేనా..
సొగసులు పారిజాతమో.. నీ పిలుపులు సుప్రభాతమ్
వైనం చూస్తే.. రుతువులలో నయగారం
రూపం చూస్తే మధువుల జలపాతం
నా మనసిక రాసే నీకై.. వలపుల మృదుకావ్యం
నాలో మౌనం.. పలికెను హిందోళం
నీ కలయిక పొందే వేళా.. కదలదు ఇక కాలం
నాలోనా.. నీవేనా
ఎగిసే కెరటమవుతోంది.. హృదయం
ఎదలో నిన్ను చేసింది .. పదిలం
నిన్నే చూస్తూ కరిగిందిలే.. కాలం
పగలే వెన్నెలయింది భువనం,
కలలే మర్చి చూస్తోంది నయనం
నీలో కలిసి రానంది నా ప్రాణం
నాలోనా.. నీవేనా
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon