తమలపాకు లాంటిదాన సాంగ్ లిరిక్స్ రక్త తిలకం (1988) తెలుగు సినిమా


Album : Raktha Tilakam

Starring: Venkatesh, Amala
Music : Chakravarthy
Lyrics-Veturi 
Singers :Sp Balu, Suseela
Producer: K. Ashok Kumar
Director: B. Gopal
Year: 1988
English Script Lyrics CLICK HERE



తమలపాకు లాంటిదాన
నీ అందమంత తాంబూలం వేసుకోనా
పత్తిపువ్వు లాంటిదాన
వయ్యారమంత పరుపుగా చేసుకోనా
సరసాల కౌగిట్లో చెరవేయనా
గిలిగింత వడ్డాణం పెట్టేయనా

చందమామ లాంటివాడ

నీ వెన్నెలంత చీరగా చుట్టుకోనా
సూరీడు లాంటివాడ
నీ చేయి తగిలి మంచులా కరిగిపోనా
చిలకల్లే సిగ్గులతో పలకరించనా
తొలిప్రేమ పన్నీరు చిలకరించనా

పున్నపువ్వు నడుము నీది 

దాన్ని పట్టకుంటే తప్పు నాది
కలువపువ్వు సొగసు నీది 
దాన్ని దోచుకునే హక్కు నాది
పోట్లగిత్త పొగరు నీది 
దాన్ని తట్టుకొనే వడుపు నాది
ఆకతాయి చెయ్యి నీది 
దాన్ని ఆపేసే చూపు నాది
సరదాల పరువాలు నీవే 
మురిపాల దూకుళ్ళు నావే
సింగారి సంపంగి నేనే  
పొంగారె వలపంతా నాదే

తమలపాకు లాంటిదాన

నీ అందమంత తాంబూలం వేసుకోనా
చందమామ లాంటివాడ
నీ వెన్నెలంత చీరగా చుట్టుకోనా

ఊరుకోని వయసు నీది 

మరి దాచలేని మనసు నాది
చిలిపి చిలిపి చూపు నీది 
దాన్ని ఇసురుకొనే గుండె నాది
అడవి నెమలి కులుకు నీది 
దాన్ని పెనవేసే ఆశనాది
అసలు అందమంత నీది 
దాన్ని అందుకునే కిటుకు నాది
ఈ కన్నె సిగపువ్వు నీదే 
ఎరుపెక్కే పులకింత నాదే
నీ బుగ్గ సిరి చుక్క నేనే 
నిన్నిడిచి నేనుండలేనే

చందమామ లాంటివాడ

నీ వెన్నెలంత చీరగా చుట్టుకోనా
తమలపాకు లాంటిదాన
నీ అందమంత తాంబూలం వేసుకోనా
తొలిప్రేమ పన్నీరు చిలకరించనా
గిలిగింత వడ్డాణం పెట్టేయనా 
Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)