ఉండిపో ఉండిపో చేతిలో గీతలా సాంగ్ లిరిక్స్ ఇస్మార్ట్ శంకర్ (2019) తెలుగు సినిమా


Album : Ismart Shankar
Starring: Ram Pothineni, Nidhhi Agerwal, Nabha Natesh
Music : Mani Sharma
Lyrics-Bhaskar Batla 
Singers :Anurag Kulkarni & Ramya Behara 
Producer: Puri Jagannadh, Chamme Kaur
Director: Puri Jagannadh
Year: 2019
English Script Lyrics CLICK HERE

ఉండిపో ఉండిపో చేతిలో గీతలా .. 
ఎప్పుడూ ఉండిపో నుదుటిపై రాతలా .. 
ఉండిపో ఉండిపో కళ్లలో కాంతిలా .. 
ఎప్పుడూ ఉండిపో పెదవిపై నవ్వులా
నీతోనే నిండిపోయే
నా జీవితం
వదిలేసి వెళ్లనంది
ఏ జ్ఞాపకం..

మనసే మొయ్యలేనంతలా
పట్టి కొలవలేనంతలా 
విప్పి చెప్పలేనంతలా
హాయే కమ్ముకుంటోందిగా
ఏంటో చంటిపిల్లాడిలా
నేనే  తప్పిపోయానుగా
నన్నే వెతుకుతూ ఉండగా 
నీలో దొరుకుతున్నానుగా

ఉండిపో ఉండిపో చేతిలో గీతలా .. 
ఎప్పుడూ ఉండిపో నుదుటిపై రాతలా .. 

సరికొత్త తడబాటే
మారింది అలవాటులాగా
ఇది చెడ్డ అలవాటే
వదిలేసి ఒక్క మాటు రావా
మెడ వంపు తాకుతుంటే మునివేళ్లతో
బిడియాలు పారిపోవా ఎటువైపుకో
ఆహా సన్నగా సన్నగా
సన్న జాజిలా నవ్వగా
ప్రాణం లేచి వచ్చిందిగా
మళ్ళీ పుట్టినట్టుందిగా
ఓహో మెల్లగా మెల్లగా 
కాటుకళ్ళనే  తిప్పగా
నేనో రంగులరాట్నామై
చుట్టూ తిరుగుతున్నానుగా

తలనిమిరే చనువవుతా 
నువ్వు గాని పొలమారుతుంటే 
ఆ మాటే  నిజమైతే..
ప్రతిసారి పొలమారి పోతా..
అడగాలి గాని నువ్వు అలవోకగా
నా ప్రాణమైన ఇస్తా అడగొచ్చుగా..
ప్రాణం నీదని నాదని
రెండు వేరుగా లేవుగా
ఎపుడో కలుపుకున్నాం కదా
విడిగా ఉండలేనంతగా
ఉందాం అడుగులో అడుగులా
విందాం ప్రేమలో గల గల
బంధం బిగిసిపోయిందిగా
అంతం కాదులే మన కథ

Share This :sentiment_satisfied Emoticon