తిరుగుడే తిరుగుడే సాంగ్ లిరిక్స్ వినరా సోదర వీరకుమార (2019) తెలుగు సినిమా
Album : Vinara Sodara Veera Kumara

Starring: Sreenivas Sai, Priyanka Jain
Music : Shravan Bharadwaj
Lyrics-Laxmi Bhupal 
Singers :Shravan Bharadwaj
Producer: Laxman Kyadari
Director: Sateesh Chandra Nadella

Year: 2019
English Script Lyrics CLICK HERE
తెల్లవారి కోడికన్న ముందులేసి 
నల్లగున్న ఒంటిమీద సబ్బురాసి 
పిల్లగాడు సిగ్గుతోటి మొగ్గలేసి 
పిచ్చినవ్వు నవ్వెనే
కళ్ళజోడు పెట్టినాడు సూపర్ స్టార్ 
జుట్టు కాస్త దువ్వినాడు స్టైలిష్ స్టార్ 
పౌడరే కొట్టినాడు పవర్ స్టార్ 
ప్రేమలోన బడ్డడే.. 
ఎక్కడో తొక్కెనే నక్కతోక 
చక్కని చుక్కనే చూడగా
దక్కునా లక్కుతో చంద్రవంక 
చిక్కితే చుక్కలే చూసిరాడా. 

తిరుగుడే తిరుగుడే తిరుగుడే
తిరుగుడే తిరుగుడే తిరుగుడే 
తిరుగుడే తిరుగుడే తిరుగుడే 

కొత్త కొత్తగుంది రోజు వెళ్ళే దారే 
మత్తుమత్తుగుంది దాటి వచ్చె గాలె 
ఎంత మారుతుంది ఒక్క ప్రేమతోనే 
మురిసిపోయె పిల్లోడే 
చూడనంత సేపు పోజు కొట్టినాడే 
ఓర చూపు చూస్తే ఒణుకుపుట్టిపోయె
దగ్గరవ్వలేడు దూరముండలేడు 
నిదర కూడ పోలేడే 

తిరుగుడే తిరుగుడే తిరుగుడే
తిరుగుడే తిరుగుడే తిరుగుడే 
తిరుగుడే తిరుగుడే తిరుగుడే 

తిక్కలోడెగాని చెడ్డవాడు కాడే 
లెక్కచేయడింక పోటుగాడు వీడే 
డబ్బులేదుగాని గుండె చీల్చుతాడే 
ప్రేమ పిచ్చి పూజారే 
ఫ్రెండుగాడు ఉంటె రెచ్చిపోతాడే 
నువ్వు దక్కకుంటె సచ్చిపోతాడే 
నీ కాలిమెట్టె కూడా దాచుకుంటాడే 
వీడు చాల మంచోడే 

తెల్లవారి కోడికన్న ముందులేసి 
నల్లగున్న ఒంటిమీద సబ్బురాసి 
పిల్లగాడు సిగ్గుతోటి మొగ్గలేసి 
పిచ్చినవ్వు నవ్వెనే
కళ్ళజోడు పెట్టినాడు సూపర్ స్టార్ 
జుట్టు కాస్త దువ్వినాడు స్టైలిష్ స్టార్ 
పౌడరే కొట్టినాడు పవర్ స్టార్ 
ప్రేమలోన బడ్డడే.. 

తిరుగుడే తిరుగుడే తిరుగుడే
తిరుగుడే తిరుగుడే తిరుగుడే 
తిరుగుడే తిరుగుడే తిరుగుడే
Share This :sentiment_satisfied Emoticon