సందె పొద్దులకాడ సంపంగి నవ్వింది సాంగ్ లిరిక్స్ అభిలాష (1983) తెలుగు సినిమా


Album:Abhilasha

Starring:Chiranjeevi, Radhika
Music :Illayaraja
Lyrics-Veturi
Singers :SP Balu, Janaki
Producer:K.S.Rama Rao
Director:Kodandarami Reddy
Year: 1983
English Script Lyrics CLICK HERE
సందె పొద్దులకాడ సంపంగి నవ్వింది
అందగత్తేని చూడ జాబిల్లి వచ్చింది
మబ్బు పట్టే కళ్ళు తబ్బిబ్బులయ్యే వొళ్ళు
ఎవ్వరికిస్తుందో ఏమౌతుందో
అరెరెరె ఎవ్వరికిస్తుందో ఏమౌతుందో

సందె పొద్దులకాడ సంపంగి నవ్వింది
అందగాడికి తోడు చలిగాలి రమ్మంది
ఎల్లువయ్యే ఈడు ఏడెక్కిపోఏవాడు
ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో
ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో

కొండ కోన జలకాలాడేవేల
కొమ్మ రెమ్మ చీర కట్టేవేల
పిందేపండై చిలక కొట్టేవేల
పిల్లగాలి నిదరే పోఏవేల
కలలో కౌగిలే కన్ను దాటాలా
ఎదలే పోదరిల్లై వాకిలి తీయ్యాల
ఎదటే తుమ్మెద పాట పూవుల బాట వేయ్యాల

మల్లె జాజి మత్తు జల్లేవేల
పిల్ల గాలి జోలపాడే వేల
వానే వాగై వరదై పొంగేవేల
నేనే నీవై వలపై సాగేవేల
కన్నులు కొడుతుంటే ఎన్నెల పుట్టాల
పుట్టిన ఎన్నెల్లో పుటకలు కాగాలా
పగలే ఎన్నెలగువ్వ చీకటి గువ్వలాడాలా

 సందె పొద్దులకాడ సంపంగి నవ్వింది
 అందగాడికి తోడు చలిగాలి రమ్మంది
Share This :sentiment_satisfied Emoticon