ఓ నవీనా నవీనా సాంగ్ లిరిక్స్ గోవిందా గోవిందా (1994) తెలుగు సినిమా


Album: Govinda Govinda
Starring:Akkineni Nagarjuna, Sri Devi
Music :: Raj-Koti
Lyrics-Veturi
Singers : SP Balu, Chitra
Producer:C. Ashwini Dutt
Director:Ram Gopal Varma
Year:1994
English Script Lyrics Click Here

ఓ నవీనా..నవీనా..నవీనా ఓ ఓ ఓ ఓ ఓ
ఈ జగాన నువ్వేనా హసీనా ఓ ఓ ఓ ఓ ఓ
ఏమి పులకింత ఇది ఎంత గిలిగింత
ఇది ఎంత ఘాటు ప్రేమ తాకిడో

ఓ నవీనా నవీనా నవీనా ఓ ఓ ఓ ఓ ఓ
ఈ జగాన నువ్వేనా హసీనా ఓ ఓ ఓ ఓ ఓ
ఏమి పులకింత ఇది ఎంత గిలిగింత
ఇది ఎంత ఘాటు ప్రేమ తాకిడో
ఓ నవీనా నవీనా నవీనా..ఆ ఆ ఆ 

కోకనైనా కాకపోతి కొమ్మచాటు సోకులన్నీ
తడిమే వేడిలో
కౌగిలైనా కాకపోతి ఆకలైన అందమంతా
అడిగే వేళలో
నీలోని తడి అందాలు..శృంగార మకరందాలు
నీ తీపి బలవంతాలు దోచేసె నా స్వప్నాలు
వసంతమాడే వయస్సు నీదే
అది తెలిసిన సరసుడు..కలిసిన పురుషుడు జతపడితే

ఓ నవీనా ఆహా హా ఆహాహా..
ఓ నవీనా నవీనా..ఓ ఓ ఓ ఓ ఓ
ఈ జగాన నువ్వేనా హసీనా..ఓ ఓ ఓ ఓ ఓ

ఏమి పులకింత ఇది ఎంత గిలిగింత
ఇది ఎంత ఘాటు ప్రేమ తాకిడో


ఒంపులోన సొంపులిచ్చి..చెంపలోన కెంపులిచ్చి ఒదిగే వేళలో
నిద్దరోని కొత్తపిచ్చి నిన్ను చూసి..కన్నుగిచ్చి కలిసే ఆశలో
అల్లారు వయ్యారాలే..అల్లాడిపోయే వేళ
చల్లారు పొద్దుల్లోన..ఊపెయ్యనా ఉయ్యాల
ఇదేమి గోలా..ఆ ఆ ఆ..వరించు వేళ
మనసెరిగిన సొగసరి..మదనుడి మగసిరి కలబడితే

ఓ హోహో..నవీనా నవీనా నవీనా 
ఓ నవీనా..నవీనా..నవీనా ఓ ఓ ఓ ఓ ఓ 
ఈ జగాన నువ్వేనా హసీనా ఓ ఓ ఓ ఓ ఓ
గాలి గిలిగింత చెలి గాలి పులకింత
తొలి ప్రేమదెంత ఘాటు తాకిడో
 మ్మ్..ఆహాహా..ఒహోహో
Share This :sentiment_satisfied Emoticon