తనదు వరసత్వమును (జానకీ కాంత స్మరణం) సాంగ్ లిరిక్స్ శృతిలయలు (1987) తెలుగు సినిమా


Album : Shrutilayalu

Starring: Rajasekhar, Sumalata
Music : K. V. Mahadevan
Lyrics-Sirivennela
Singers :Balu, Suseela
Producer: Karunakar, Sudhakar
Director: K. Viswanath
Year: 1987
EngliSh Script Lyrics CLICk HERE



జానకీ కాంత స్మరణం
జయ జయ రామ్..
హరనమః పార్వతీ పతయే..
హర హర మహాదేవ్..
శరణు శరణు సురేంద్ర సన్నుత
శరణు శ్రీసతి వల్లభా..
శరణు శరణు సురేంద్ర సన్నుత
శరణు శ్రీసతి వల్లభా..
శరణు శ్రీసతి వల్లభా..
శరణు రాక్షస గర్వ సంహర
శరణు రాక్షస గర్వ సంహర
శరణు వేంకట నాయక
శరణు వేంకట నాయక
స్వామి శ్రీ రఘునాయకా
శరణు శరణూ.. హరే...

తనదు వరసత్వమును
వారసత్వముగనిడి
తనువిచ్చు తండ్రికిదే తొలి వందనం
తండ్రికిదే తొలి వందనం

మమతానురాగాల కల్పతరువై
మంచిచెడు నేర్పించు మొదటి గురువై
ముక్కోటి వేల్పులను ఒక్క రూపున జూపు
మాతృపద పద్మములకిదె వందనం..
వందనం.. వందనం..

నటరాజ చరణాబ్జ సంసర్గ పరిపూత
నాట్య నిగమము దాల్చు రంగస్థలీ మాత 
తక ఝణుత తథిగిణత
తోం తకిట తక తకిట
జతుల సుమ గతులతో
అభివందనం అభివందనం
అభివందనం...

సాసాస సగ సగ సనీనీ 
సపనీస గసగమప మాగా
గమపనిప నీసా
గమపనిప గామా
సపమ సమగ సమగా
సగసనిప నీసాససా..

సాగెనే నాట్య వేదం
దిశల మ్రోగెనే ప్రణవ నాదం
సాగెనే నాట్య వేదం
దిశల మ్రోగెనే ప్రణవ నాదం
శంభుని పదాంబుజమ్ముల స్పర్శకు 
కుంభిని ముదాంబుధిగ నుప్పొంగగ
సాగెనే సాగెనే వేదం.. నాట్యవేదం

భం..భంభం..భంభం..భంభం..
గిరి కందరములె శంఖములై
నినదించే పటు నిర్ఘోషం
ఢమఢమ ఢమఢమ ఢమఢమ
జలద పటలముల
ఢమరుధ్వనముల
చెలగే నీలాకాశం

ధిమిధిమిధిమిధిమి ధింతకధిమ్మను
అభంగ తరంగ మృదంగ స్వరముల
నిలింప ఝురీ విలాసం 
నటుల జతుల పటహాదివాద్యతతి
చటల జటల చరళాడు తటిద్యుతి
ధరాధరాత్మజ సహానువర్తిగ  
సురాళి నుతించ స్వరారి ఘటించ
సాగెనే సాగెనే సాగెనే నాట్యవేదం
దిశల మ్రోగెనే ప్రణవ నాదం.. 
ఓం నమశ్శివాయా..

ఈశానస్సర్వ విద్యానామీశ్వర స్సర్వభూతానాం
బ్రహ్మాధిపతిర్-బ్రహ్మణోஉధిపతిర్-బ్రహ్మా
శివో మే అస్తు సదా శివోమ్ |
Share This :



sentiment_satisfied Emoticon