వెన్నెలై పాడనా సాంగ్ లిరిక్స్ శ్రీ కనక మహలక్ష్మీ రికార్డింగ్ డాన్స్ ట్రూప్ (1987) తెలుగు సినిమా


Album : Sri Kanaka Mahalakshmi Recording Dance Troupe

Starring: Naresh Madhuri
Music : Illayaraja
Lyrics-Veturi
Singers :S. P. Balasubrahmanyam, S.Janaki 
Producer: Sri Sravanthi Movies
Director: Vamsi
Year: 1987

English Script Lyrics Click Here


వెన్నెలై పాడనా
నవ్వులే పూయనా
మల్లెలే పొదగనా
పూవులో నవ్వులో మువ్వలా
ఒంపులో సొంపులో కెంపులా
కలకల పొదలో కిలకిల కధనం
ముసిముసి రొదలో అలసట మధురం

పొద్దులో మీటనా
ముద్దులే నాటనా
హద్దులే దాటనా
ఇవ్వనా యవ్వనం పువ్వునై
గువ్వనై గవ్వనై నవ్వనా
లలనామణినై కలలో మణినై
నవలామణినై చింతామణినై

లీలగా తూగుతూ ఏమిటో దేహమే
వేడుకా ధారలే దాహమై కోరిన
పాడుతూ వేడిగా కోరుతూ పాడిన
భేషజం చూపుతూ దోహదం చేయవు
మోవికెంపు బాధ గుండె మువ్వ గాధ
పొద్దు పువ్వులాగ నవ్వుతుంది చూడు
 వెలుతురు నేత్రమే సోకని ప్రాంగణము
గాలికే ఊపిరి పూసే పరిమళము

చందనం పూయనా పూలలో రాజుకి
నోచిన నోముకే పూచిన రోజుకి
సుందరం ధూపమే వేయనా పూజకి
జాలిగా గాలిలో వీచిన మోజుకి
ప్రమిద కాంతి పువ్వు
ప్రమద చిలుకు నవ్వు
కలికి కళలు రాసే కధలు పురము వాసి
బ్రతుకున పలికిన కిలకల కూజితము
మధురమై మొలవనీ ఉలి శిల ఖేలనము 
Share This :



sentiment_satisfied Emoticon