నిత్యం ఏకాంత క్షణమే సాంగ్ లిరిక్స్ అద్బుతం (1999) తెలుగు సినిమా



Album:Adbutham

Starring:Ajith Kumar, Shalini
Music:Bharadwaj
Lyrics-Veturi
Singers :Balu, chithra
Producer:V. Sudhir Kumar
Director:Saran
Year:1999











నిత్యం ఏకాంత క్షణమే అడిగా
యుద్దం లేనట్టి లోకం అడిగా
రక్త తరంగ ప్రవాహం అడిగా
ఉదయం లాంటి హృదయం అడిగా
నిత్యం ఏకాంత క్షణమే అడిగా
యుద్దం లేనట్టి లోకం అడిగా
రక్త తరంగ ప్రవాహం అడిగా
ఉదయం లాంటి హృదయం అడిగా


నిత్యం ఏకాంత క్షణమే అడిగా
యుద్దం లేనట్టి లోకం అడిగా
రక్త తరంగ ప్రవాహం అడిగా
ఉదయం లాంటి హృదయం అడిగా
అనుబంధాలకు ఆయుస్సడిగా
ఆనందాశ్రువులకు ఆశీస్సడిగా
మదినొప్పించని మాటలు అడిగా
ఎద మెప్పించే యవ్వనం అడిగా
పిడుగులు రాల్చని మేఘం అడిగా
జ్వలించు నూరేళ్ళ పరువం అడిగా
వరించి తరించు వలపే అడిగా
ప్రాణతుల్యమౌ బంధం అడిగా
పచ్చికలో మంచు ముత్యాలడిగా
పువ్వుల ఒడిలో పడకే అడిగా
తనువోదార్చే ఓర్పుని అడిగా
తలను నిమిరే వ్రేళ్ళను అడిగా
నెమలి ఆటకు పదమే అడిగా
కోయిల పాటకు పల్లవి అడిగా
గదిలో గుక్కెడు నీళ్ళే అడిగా
మదిలో జానెడు చోటే అడిగా
మచ్చంటూ లేని జాబిలిని అడిగా
నక్షత్రకాంతి నట్టింటడిగా
దుఃఖం వదించు అస్త్రం అడిగా
అస్త్రం ఫలించు యోగం అడిగా
చీకటి ఊడ్చే చీపురుని అడిగా
పూలకు నూరేళ్ళ ఆమని అడిగా
మానవ జాతికి ఒక నీతడిగా
వెతల రాత్రికే వేకువనడిగా
ఒకటే వర్ణం సబబని అడిగా
ఒక అనురాగం గుడిలో అడిగా
వాలని పొద్దున నెలవంకడిగా
ప్రాణము ఉండగా స్వర్గం అడిగా
న్యాయం ధర్మం ఇలలో అడిగా
ఎద రగిలించే కవితే అడిగా
కన్నీరెరుగని కన్నే అడిగా
క్షామం నశించు కాలం అడిగా
చుక్కలు దాటే స్వతంత్రమడిగా
దిక్కులు దాటే విహంగమడిగా
తొలకరి మెరుపుల నిలకడనడిగా
ఎండ మావిలో ఏరును అడిగా
మూగపాటకొక చరణం అడిగా
మౌనభాష వ్యాకరణమడిగా
నమ్మి చెడని ఓ స్నేహం అడిగా
శాంతిని పెంచే సంపదనడిగా
వస్తే వెళ్ళని వసంతం అడిగా
ఏడేడు జన్మలకు ఒక తోడడిగా
ఏనాడు వాడని చిరునవ్వడిగా
ముసిరే మంచుల ముత్యాలడిగా
ముసి ముసి నవ్వుల ముగ్గులు అడిగా
ఆశల మెరుపుల జగమే అడిగా
అంధాకారమా పొమ్మని అడిగా
అందరి ఎదలో హరివిల్లడిగా
మరుగై పోని మమతను అడిగా
కరువైపోని సమతను అడిగా
రాయలంటి కవి రాజును అడిగా
బమ్మెర పోతన భక్తిని అడిగా
భారతి మెచ్చిన తెలుగే అడిగా
పాశుపతాస్త్రం నరుడై అడిగా
మోహన కృష్ణుడి మురళే అడిగా
మధుర మీనాక్షి చిలకే అడిగా
ఉన్నది చెప్పే ధైర్యం అడిగా
ఒడ్డెక్కించే గమ్యం అడిగా
మల్లెలు పూసే వలపే అడిగా
మంచిని పెంచే మనసే అడిగా
పంజా విసిరే దమ్మే అడిగా
పిడుగుని పట్టే వొడుపే అడిగా
ద్రోహం అణిచే సత్తానడిగా
చస్తే మిగిలే చరిత్ర అడిగా
విధిని జయించే ఓరిమిని అడిగా
ఓరిమిలో ఒక కూరిమిని అడిగా
సహనానికి హద్దేదని అడిగా
దహనానికి అంతేదని అడిగా
కాలం వేగం కాళ్ళకు అడిగా
చిన్న చితక జగడాలడిగా
తియ్యగా ఉండే గాయం అడిగా
గాయానికి ఒక ధ్యేయం అడిగా
పొద్దే వాలని ప్రాయం అడిగా
ఒడిలో శిశువై చనుబాలడిగా
కంటికి రెప్పగ తల్లిని అడిగా
ఐదో ఏట బడినే అడిగా
ఆరో వేలుగా పెన్నే అడిగా
ఖరీదు కట్టని కరుణే అడిగా
ఎన్నెని అడగను దొరకనివి
ఎంతని అడగను జరగనివి
ఎవ్వరినడగను నా గతిని
కళ్ళకు లక్ష్యం కలలంటూ
కాళ్ళకు గమ్యం తాడంటూ
భగవధ్గీత వాక్యం వింటూ
మరణం మరణం శరణం అడిగా

Share This :



sentiment_satisfied Emoticon