ఎదుట నీవే ఎదలోన నీవే సాంగ్ లిరిక్స్ అభినందన (1988) తెలుగు సినిమా


Album:Abhinandana

Starring:Karthik, Shobana, Sarath Babu, Rajya Lakshm
Music:Ilayaraja
Lyrics-Aatreya
Singers :S.P. Balasubrahmanyam
Producer:G.Babu
Director:Ashok Kumar
Year:1988









ఎదుట నీవే ఎదలోన నీవే
ఎదుట నీవే ఎదలోన నీవే
ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే

మరుపే తెలియని నా హృదయం
తెలిసీ వలచుట తొలి నేరం 
అందుకె ఈ గాయం
గాయాన్నైనా మాననీవు 
హృదయాన్నైనా వీడిపోవు
కాలం నాకు సాయం రాదు 
మరణం నన్ను చేరనీదు
పిచ్చివాణ్ణి  కాలేదు

కలలకు భయపడిపోయాను 
నిదురకు దూరం అయ్యాను వేదన పడ్డాను
స్వప్నాలైతే క్షణికాలేగా సత్యాలన్నీ నరకాలేగా
స్వప్నం సత్యమైతే వింత సత్యం స్వప్నమయ్యేదుందా
ప్రేమకింత బలముందా 
అహహా ఓహొహో హూ హూ హూ హూ

ఎదుట నీవే ఎదలోన నీవే
ఎదుట నీవే ఎదలోన నీవే
ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే
Share This :



sentiment_satisfied Emoticon