Album:Manchi Rojulu Vachayi
Starring: ANR, Kanchana
Music :T Chalapathi Rao
Lyrics-Devulapalli Krishnasasthri
Singers :Ghantasala
Producer:SS Balan
Director: V Madhusudhana Rao
Year: 1972
నేలతో నీడ అన్నది నను తాకరాదని
పగటితో రేయి అన్నది నను తాకరాదని
నీరు తన్ను తాకరాదని గడ్డి పరక అన్నది
నేడు భర్తనే తాకరాదని ఒక భార్య అన్నది
వేలికొసలు తాకనిదే వీణ పాట పాడేనా
చల్లగాలి తాకనిదే నల్ల మబ్బు కురిసేనా
తల్లి తండ్రి ఒకరినొకరు తాకనిదే
నీవు లేవు నేను లేను
నీవు లేవు నేను లేను
లోకమే లేదులే
నేలతో నీడ అన్నది నను తాకరాదని
పగటితో రేయి అన్నది నను తాకరాదని
రవికిరణం తాకనిదే నవ కమలం విరిసేనా
మధుకుంతం తాకనిదే మందారం మురిసేనా
మేను మేను తాకనిదే మనసు మనసు కలవనిదే
మమత లేదు మనిషి లేడు
మమత లేదు మనిషి లేడు
మనుగడయే లేదులే
నేలతో నీడ అన్నది నను తాకరాదని
పగటితో రేయి అన్నది నను తాకరాదని
అంటరానితనము ఒంటరితనము
అనాదిగా మీజాతికి అదే మూలధనము
అంటరానితనము ఒంటరితనము
అనాదిగా మీజాతికి అదే మూలధనము
ఇక సమభావం సమధర్మం సహజీవనమనివార్యం
తెలుసుకొనుట నీ ధర్మం తెలియకుంటే నీ ఖర్మం
నేలతో నీడ అన్నది నను తాకరాదని
పగటితో రేయి అన్నది నను తాకరాదని
నీరు తన్ను తాకరాదని గడ్డి పరక అన్నది
నేడు భర్తనే తాకరాదని ఒక భార్య అన్నది
ఈ భార్య అన్నది
comment 1 comments:
more_vertమధుకుంతం కాదు
13 March 2024 at 22:43మధుపం (అంటే తుమ్మెద)
sentiment_satisfied Emoticon