Starring:Ram Charan, Kajal Aggarwal
Music:Yuvan Shankar Raja
Lyrics-Chandrabose
Singers :Ranjith, Vijay Yesudas, Surmukhi, Sri Vardhini
Producer:Ganesh Babu
Director:Krishna Vamsi
Year: 2014
చిన్నారికి వోణీలిచ్చెయ్ వయ్యారిపై బాణాలేసేయ్చి
న్నారికి వోణీలిచ్చె వయ్యారిపై బాణాలేసే
శుభకార్యం జరుపుటకై వచ్చాడు వచ్చాడు
బంగారి బావ బంగారి బావ బంగారి బావా
బావగారి చూపే బంతి పువ్వై పూసిందే
బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే
మరదలి మాటల్లో మందారం జారిందే
కలిసిన బంధంలో కురిసేనే ఇలా
పువ్వుల చినుకులే పువ్వుల చినుకులే
బావగారి చూపే బంతి పువ్వై పూసిందే
బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే
మరదలి మాటల్లో మందారం జారిందే
కలిసిన బంధంలో కురిసేనే ఇలా
పువ్వుల చినుకులే పువ్వుల చినుకులే
లంగా తోటి వోణీకుంది ఓ బంధం
ఈ రాజా తోటి రాణికుంది అనుబంధం
పాదాలకి అందెలకుంది ఓ బంధం
ఈ ప్రాయానికి అల్లరికుంది అనుబంధం
వాలు జడ జాజులు ఓ జంట
వడ్డాణము నడుము ఓ జంట
ఇక నీతో నేనవుతా జంటా
చేతులకి జంటే గోరింట లేకపోతె కళే లేదంట
నా వెంటే నువ్వుంటే కురిపిస్తా నీపై
బంగరు చినుకులే బంగరు చినుకులే
బావగారి చూపే బంతి పువ్వై పూసిందే
బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే
నవ్వుల్లోన బంధం అందం మెరుస్తుంది
అరె బాధల్లోన బంధం బలం తెలుస్తుంది
ఏయ్ రూపం లేని ప్రాణం తానై నిలుస్తుంది
ఆ ప్రాణం పోయే క్షణం దాక తపిస్తుంది
కమ్మనైన బంధం ఈనాడే కోవెలల్లె మారే ఈచోటే
ఈ కోవెల్లో భక్తుడు నేనే
అల్లుకున్న బంధం ఇవ్వాళే ఇల్లుకట్టుకుంది ఈ చోటే
ఈ ఇంట్లో మనవడినై
ఈ ఇంట్లో మనవాడినై కురిపిస్తా మీపై
ప్రేమల చినుకులే ప్రేమల చినుకులే
బావగారి చూపే బంతి పువ్వై పూసిందే
బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే
మరదలి మాటల్లో మందారం జారిందే
కలిసిన బంధంలో కురిసేనే ఇలా
పువ్వుల చినుకులే పువ్వుల చినుకులే
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon