Album: Varsham
Starring:Prabhas, Trisha
Music :Devi Sri Prasad
Lyrics-Sirivennela
Singers :SP Charan, Sumangali
Producer:M.S. Raju
Director:Sobhan
Year: 2004
English Script Lyrics Click Here
మెల్లగా కరగని రెండు మనస్సుల దూరం
చల్లగా తెరవని కొంటె తలుపులు ద్వారం
వలపు వాన దారాలే పంపుతున్నది ఆకాశం
చినుకు పూల హరాలే అల్లుతున్నది మనకోసం
తడిపి తడిప ఇ తనతో నడిపి హరివిల్లులు వంతెన వేసిన శుభవేళ
ఈ వర్షం సాక్షిగా తెలపని నువ్వు నాకే సొంతం
ఈ వర్షం సాక్షిగా కలపని బంధం
మెల్లగా కరగని రెండు మనస్సుల దూరం
చల్లగా తెరవని కొంటె తలుపులు ద్వారం
నీ మెలికలలోన ఆ మెరుపులు చూస్తున్న ఈ తొలకరిలో
తళ తళ నాట్యం ఇదేనా
ఆ ఉరుములలోన నీ గెలుపులు వింటున్నా ఈ
చిటపటలో చిటికెల స్థానం నీదేనా
నీ మతి చెడై దాహమై అనుసరించి వస్తున్నా
జతపడే స్నేహమై అనునయించనా
చలిపిడుగుల సడి విని జడిసిన విడియను తడబడి నిన్ను విడగా
ఈ వర్షం సాక్షిగా తెలపని నువ్వు నాకే సొంతం
ఈ వర్షం సాక్షిగా కలపని బంధం
ఏ తెరమరుగైనా ఈ చొరవదు ఆపేదా నా పరువముని
కనులకు కానుక ఇస్తున్నా
ఏ చిరు చినుకైనా నీ సిరులను చూపేనా ఆ వరుణునికే
రుణపడిపోనా ఈ పైనా
త్వరపడే వయస్సునే నిలుపలేను ఇకపైనా
విడుదలే వద్దనే ముడులు వేయనా
మన కలయిక చెదరని చెలిమికి ఋజువని చరితలు చదివేలా !
ఈ వర్షం సాక్షిగా తెలపని నువ్వు నాకే సొంతం
ఈ వర్షం సాక్షిగా కలపని బంధం
మెల్లగా కరగని రెండు మనస్సుల దూరం
చల్లగా తెరవని కొంటె తలుపులు ద్వారం
వలపు వాన దారాలే పంపుతున్నది ఆకాశం
చినుకు పూల హరాలే అల్లుతున్నది మనకోసం
తడిపి తడిప ఇ తనతో నడిపి హరివిల్లులు వంతెన వేసిన శుభవేళ
ఈ వర్షం సాక్షిగా తెలపని నువ్వు నాకే సొంతం
ఈ వర్షం సాక్షిగా కలపని బంధం
comment 5 comments:
more_vertకలపనీ ,తెలపనీ ... అని ఉండాలి.
తెలపని,కలపని అని కాకుండా
ఈ పాటల బ్లాగులన్నీ ఎత్తిపోతల పధకాలేగా ఆడ ఎత్తుడు ఈడ దించుడు తప్పుల్లేకుండా రాయటాననికేమన్నా సొంతగా ఇని రాసుడా ఏంది.
ఒకటే పాటని నిన్నకరు మొన్నకరు రేపకరు పోస్టు చేసుడు పోస్టు చేసేవోరికి తెలవకపోతే చూసేవోరికి తెలియదా
మీరు పాట విని తప్పులుంటే కామెంట్ చెయ్యండి మేము టైపు చేసిన దాంట్లో తప్పులు లేవు
మంచిది మీకు విమర్సలు చెయ్యడం సరదా అనుకుంట చెయ్యండి తప్పులేదు కానీ పాట వింటూ మేము టైపు చేసిన లిరిక్స్ చూసి కామెంట్ చేస్తేయ్ బాగుంటుంది మా సమయం వెచ్చించి పాటలు ఎడిట్ చేస్తూ మా వినికిడి గ్రహణ తో విని టైపు చేసి పోస్ట్లు వేస్తునం గమించగలరు మీకు నచ్చకపోతే మా బ్లాగ్ ని సందర్శన చేయ్యన్కరలేదు
Nice lyrics
sentiment_satisfied Emoticon