తూనీగా తూనీగా సాంగ్ లిరిక్స్ మనసంతా నువ్వే (2001) తెలుగు సినిమా



Album Manasantha Nuvve

Starring: Uday Kiran, Reema Sen
Music :R. P. Patnaik
Lyrics-Sirivennela
Singers :Sujatha,Sanjeev
Producer:M. S. Raju
Director: V. N. Aditya
Year: 2001












తూనీగా తూనీగా 
ఎందాకా పరిగెడతావే రావే నా వంక
దూరంగా పోనీక
ఉంటాగా నీ వెనకాలే రానీ సాయంగా
ఆ వంక ఈ వంక అహో తిరిగావే ఎంచక్కా
ఇంకానా చాలింక ఒహో ఇంతేగా నీ రెక్క
ఎగిరేనా ఎప్పటికైనా ఆకాశం దాకా
తూనీగా తూనీగా
ఎందాకా పరిగెడతావే రావే నా వంక

దోసిట్లో ఒక్కో చుక్క పోగేసి ఇస్తున్నాగా
వదిలెయ్యకు సీతాకోక చిలకలుగా
వామ్మో బాగుందే చిట్కా నాకూ నేర్పిస్తే చక్క
సూర్యున్నే కరిగిస్తాగా చినుకులుగా
సూర్యుడు ఏడి నీతో ఆడి
చందమామ అయిపోయాడుగా
ఓ..ఓ..ఓ..ఓ...
తూనీగా తూనీగా
ఎందాకా పరిగెడతావే రావే నా వంక

ఆ కొంగలు ఎగిరి ఎగిరి సాయంత్రం గూటికి మళ్ళీ
తిరిగొచ్చే దారిని ఎపుడూ మరిచిపోవెలా
ఓసారటు వైపెళుతుంది మళ్ళీ ఇటువైపొస్తుంది
ఈ రైలుకు సొంతూరేదో గురుతు రాదెలా 
కూ కూ బండి మా ఊరుంది 
ఉండిపోవే మాతో పాటుగా
ఓ..ఓ..ఓ..ఓ...

తూనీగా తూనీగా
ఎందాకా పరిగెడతావే రావే నా వంక
దూరంగా పోనీక
ఉంటాగా నీ వెనకాలే రానీ సాయంగా
ఆ వంక ఈ వంక అహో తిరిగావే ఎంచక్కా
ఇంకానా చాలింక ఒహో ఇంతేగా నీ రెక్క
ఎగిరేనా ఎప్పటికైనా ఆకాశం దాకా
తూనీగా తూనీగా
ఎందాకా పరిగెడతావే రావే నా వంక
Share This :



sentiment_satisfied Emoticon