Album Anaganaga oka roju
Starring: JD Chakravarthy, Urmila Mantodkar
Music :Sri Kommineni
Lyrics-sirivennela
Singers :Mano, Chitra
Producer:Ram Gopal Varma
Director: Ram Gopal Varma
Year: 1996
లేదు చాలా సంతోషం..
లేటయ్యిందనా..
యే ఛీ నాతో మాట్లాడకు..
మా ఫ్రెండు చెల్లెల్ని కొందరేడిపించారు..
వీడెళ్ళి వాళ్ళతోటి గొడవ పెట్టుకొచ్చాడు..
ఆ విలన్ గ్యాంగు వచ్చి మావాణ్ని కొట్టబోతే
చేశాను పెద్ద ఫైటు.. కాబట్టి ఇంత లేటు..
ఓ చెలీ క్షమించమన్నానుగా..
నీకిది ఇవాళ కొత్త కాదుగా..
అయ్యబాబోయ్.. ఎంత వేడి.. ఏం చేస్తే చల్లారుతుందది..
పోపోవోయ్ చాలు గాని ఓవరాక్షన్ తగ్గిస్తే మంచిది..
సరేలే.. టుమారో ఇలా లేటు చెయ్యనింక ఒట్టు..
ఓ చెలీ క్షమించమన్నానుగా..
నీకిది ఇవాళ కొత్తకాదుగా..
స్టోరీ చెప్పవద్దు.. బోరే కొట్టవద్దు.. వదిలేసేయ్ నన్నిలా..
సారీ చెప్పలేదా.. ఫైరింగ్ ఆపరాదా.. ఫైటింగ్ ఎంతసేపిలా..
నేరం నాదేలే నిన్ను నమ్మినందుకు..
వచ్చేశాను కదా ఇంకా బాదుడెందుకు..
ఏమి చేసినా అహో అని మెచ్చుకోమనా మహాశయా..
చిన్న తప్పుకే మరీ ఇలా దుంప తెంచితే ఎలాగట..
పూటకో సాకుతో ఆడుకోవద్దు నాతో..
నీతో లవ్వంటే మరీ కత్తి మీద సాము కాదా..
ఓ చెలీ క్షమించమన్నానుగా..
నీకిది ఇవాళ కొత్తకాదుగా..
నీకూ నాకు మధ్య వేరే మాట లేదా టాపిక్ మార్చవెందుకు..
స్విచ్చే వేసినట్టు మూడేం మారిపోదు వెయిట్ చెయ్యి మంచి మూడుకు..
దొరికే కాస్త టైము ఆర్గ్యుమెంటుతోనే సరా..
ఆ తెలివే ఉంటే ముందే రాకూడదా..
కలుసుకున్నది డిబేటుకా.. ప్రేమ అన్నది రివెంజుకా..
ఎంతసేపని భరించను.. ఛస్తున్నదే నా ఓపిక..
టెంపరే మారదే లెంపలే వేసుకున్నా..
ఓకే అనేస్తే ఎలా.... లోకువేగా నీకు ఇంక..
ఓ డియర్ క్షమించమన్నానుగా..
నీకిది ఇవాళ కొత్త కాదుగా..
అయ్యబాబోయ్.. ఎంత వేడి.. ఏం చేస్తే చల్లారుతుందది..
పోపోమ్మా చాలు గాని ఓవరాక్షన్ తగ్గిస్తే మంచిది..
సరేలే టుమారో ఇలా బెట్టు చెయ్యనింక ఒట్టు..
ఓ డియర్ క్షమించమన్నానుగా....
comment 1 comments:
more_vertExlent
sentiment_satisfied Emoticon