నేనొక ప్రేమ పిపాసిని సాంగ్ లిరిక్స్ ఇంద్రధనుస్సు (1978) తెలుగు సినిమా



Album Indhra Danussu

Starring: Krishna, Sarada
Music : KV Mahadevan
Lyrics-Athreya
Singers :
Producer:Nannapaneni Sudhakar, T Subbaraidu
Director: K.Bapaiah
Year: 1978












నేనొక ప్రేమ పిపాసిని  నీవొక ఆశ్రమవాసివి 
నా దాహం తీరనిది  నీ హృదయం కదలనిది 
నేనొక ప్రేమ పిపాసిని  నీవొక ఆశ్రమవాసివి 
నా దాహం తీరనిది  నీ హృదయం కదలనిది
నేనొక ప్రేమ పిపాసిని..

తలుపు మూసినా తలవాకిటనే  పగలు రేయి నిలుచున్నా 
పిలిచి పిలిచీ బదులేరాక  అలసి తిరిగి వెళుతున్నా 
తలుపు మూసినా తలవాకిటనే పగలు రేయి నిలుచున్నా 
పిలిచి పిలిచీ బదులేరాక  అలసి తిరిగి వెళుతున్నా 
నా దాహం తీరనిది  నీ హృదయం కదలనిది 
నేనొక ప్రేమ పిపాసిని..

పూట పూట నీ పూజ కోసమని  పువ్వులు తెచ్చాను 
ప్రేమభిక్షను పెట్టగలవని  దోసిలి ఒగ్గాను 
నీ అడుగులకు మడుగులోత్తగా  ఎడదను పరిచాను 
నీవు రాకనే అడుగు పడకనే  నలిగిపోయాను 
నేనొక ప్రేమ పిపాసిని.. 

పగటికి రేయి  రేయికి పగలు  పలికే వీడ్కోలు 
సెగ రేగిన గుండెకు చెబుతున్నా  నీ చెవిన పడితే చాలు 
నీ జ్ఞాపకాల నీడలలో నన్నెపుడో చూస్తావు 
నను వలచావని తెలిపేలోగా  నివురైపోతాను..

నేనొక ప్రేమ పిపాసిని  నీవొక ఆశ్రమవాసివి 
నా దాహం తీరనిది  నీ హృదయం కదలనిది 
నేనొక ప్రేమ పిపాసిని..


Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)