కన్నులు బాసలు తెలియవులే సాంగ్ లిరిక్స్ 7/g బృందావన కాలనీ (2004) తెలుగు సినిమా



Album: 7/G Brindhavan Colony 

Starring:Ravi Krishna, Sonia Agarwal
Music :Yuvan Shankar Raja
Lyrics-A.M. Ratnam, Siva Ganesh
Singers :Karthik
Producer:A M Ratnam
Director: Selva Raghavan
Year: 2004









కన్నులు బాసలు తెలియవులే
కన్నెల మనసులు ఎరుగములే
ఒకవైపు చూపి మరువైపు దాచగా
అద్దాల మనసు కాదులే
చేతులు సంద్రాన్ని మూయలేవులే  
ఇది అద్దాల మనసు కాదులే
చేతులు సంద్రాన్ని మూయలేవులే
గాలి వీచి ఆకురాలిన
కొమ్మ గురుతులు చెరగవులే
దెబ్బలెన్నీ తిన్నగాని
మనసు మాత్రం మారదులే
ఒక పరి మగువ చూడగనే
కలిగే వ్యధ తను ఎరుగదులే
అనుదినము ఇక తపియించే
యువకుల మనసులు తెలియవులే  
కన్నులు బాసలు తెలియవులే
కన్నెల మనసులు ఎరుగములే
ఒకవైపు చూపి మరువైపు దాచగా
అద్దాల మనసు కాదులే
చేతులు సంద్రాన్ని మూయలేవులే  

అడవిలో కాచే వెన్నెల అనుభవించెదెవ్వరులే
కన్నులా అనుమతి పొంది
ప్రేమ చెంతకు చేరదులే
దూరాన కనబడు వెలుగు దారికే చెందదులే
మెరుపులా వెలుగును పట్టగ
మిణుగురు పురుగుకి తెలియదులే
కళ్ళు నీకు సొంతమట
కడగళ్ళు నాకు సొంతమట
అల కడలి దాటగనే నురగలిక
ఒడ్డుకు సొంతమట 
కన్నులు బాసలు తెలియవులే
కన్నెల మనసులు ఎరుగములే
ఒకవైపు చూపి మరువైపు దాచగా
అద్దాల మనసు కాదులే
చేతులు సంద్రాన్ని మూయలేవులే  


లోకాన పడుచులు ఎందరున్నను
మనసొకరిని మాత్రమే వరియించులే
ఒక పరి దీవించ ఆశించగా
అది ప్రాణంతోనే ఆటాడులే
మంచు బిందువొచ్చి ఢీకొనగా
ఈ ముల్లె ముక్కలు అయిపోయెలే
భువిలో ఉన్న అబద్దాలే
అరె చీరను కట్టి స్త్రీ ఆయెలే
ఉప్పెనొచ్చినా కొండ మిగులును
చెట్లు చేమలు మాయమౌనులే
నవ్వువచ్చులే ఏడుపొచ్చులే
ప్రేమలు రెండు కలసివచ్చులే  ఒక పరి మగువ చూడగనే
కలిగే వ్యధ తను ఎరుగదులే
అనుదినము ఇక తపియించే
యువకుల మనసులు తెలియవులే  
కన్నులు బాసలు
కన్నులు బాసలు తెలియవులే
కన్నెల మనసులు ఎరుగములే
ఒకవైపు చూపి మరువైపు దాచగా
అద్దాల మనసు కాదులే
చేతులు సంద్రాన్ని మూయలేవులే  
గాలి వీచి ఆకురాలిన
కొమ్మ గురుతులు చెరగవులే
దెబ్బలెన్నీ తిన్నగాని
మనసు మాత్రం మారదులే

Share This :



sentiment_satisfied Emoticon