ఏమైందో ఏమో సాంగ్ లిరిక్స్ ప్రేమతో రా (2001) తెలుగు సినిమా


Album Prematho Raa

Starring:Venkatesh, Simran
Music :Mani Sharma
Lyrics-Sirivennala 
Singers :Sp balu, harini
Producer:T. Trivikrama Rao
Director:Udaya Shankar
Year: (2001)





ఏమైందో ఏమో నా మదిలో ఈ వేళా
ప్రేమైందో ఏమో అనుమానం కలిగేలా
అవునో కాదో అడగాలంటే తెగువే చాలదే
నిజమో కాదో తెలియకపోతే తగువే తేలదే

ఏమైందో ఏమో నా మదిలో ఈ వేళా
ప్రేమైందో ఏమో అనుమానం కలిగేలా
అవునో కాదో అడగాలంటే తెగువే చాలదే
నిజమో కాదో తెలియకపోతే తగువే తేలదే
     
హాయ్ రామా ఇదేమి ప్రేమా
హంగామా భరించతరమా
అందమ్మా అయోమయంగా .. ఉక్కిరిబిక్కిరి ఊపిరి సరిగమ        

ఏ చోటా నా పాదం నిలబడనంటుంది
ప్రతి బాటా నీ వైపే పద పద అంటోంది
మనసంతా ఎందుకనో దిగులుగ ఉంటుంది
అది కూడ చిత్రంగా బాగానే ఉంది

ఉప్పెనలా హృదయంలో  చెల రెగే కలవరం
తప్పుకునే దారేదో వెతకాలీ ఇద్దరం
ఎప్పుడు మొదలయ్యిందో నను లాగే ప్రియస్వరం
ఎప్పుడు ఎటు తోస్తుందో చెబుతుందా ఈ క్షణం

అనుకొకుండా పడదోసింది వలపే నన్నిలా
విడిపొకుండా ముడి వేసింది బిగిసే సంకెలా

ఏం ప్రేమో మతే  చెడంగా
చిక్కాము అమాయకంగా
గుండెల్లో అదోరకంగా .. చిందర వందర తొందర తికమక

ఎవరైనా నీ పేరు అనుకుంటే చాలు
కోపంతో  ఎర్రబడి కసిరే నా కళ్ళు
ఎవరైనా నిను కొంచెం గమనిస్తే చాలు
గుండె సడి ఉలికి పడి ఒకటే కంగారు

చప్పున ఒకటై పోదాం ఈ దూరం జరగని
ఎక్కడికైనా  పోదాం మన లోకం వేరని

ఎవ్వరికీ  ఏ మాత్రం కనిపించం పొమ్మని
ఆ క్షణమే మనకోసం ఏకాంతం చూడని

చిటికే వేసి పిలిచే ప్రేమ మనతో చేరగా
మనలో చేరి కరిగే ప్రేమ మనమై మారగా

ఏమైందో ఏమో నా మదిలో ఈ వేళా
ప్రేమైందో ఏమో అనుమానం కలిగేలా
అవునో కాదో అడగాలంటే తెగువే చాలదే
నిజమో కాదో తెలియకపోతే తగువే తేలదే
Share This :



sentiment_satisfied Emoticon