అహో ఒక మనసుకి సాంగ్ లిరిక్స్ అల్లరి ప్రియుడు1993) తెలుగు సినిమా


Album Allari Priyudu

Starring:Rajasekhar, Ramya Krishna, Madhu Bala
Music :Keeravani
Lyrics-Sirivennela Sitaramasastri
Singers :S. P. Balasubrahmanyam, Chitra
Producer:Konark Movie Creations
Director:K Raghavendra Rao
Year: (1993)





అహో ఒక మనసుకి నేడే పుట్టిన రోజు
అహో తన పల్లవి పాడే చల్లని రోజు
ఇదే ఇదే కుహూ స్వరాల కానుక
మరో వసంత గీతిక జనించు రోజు
అహో ఒక మనసుకి నేడే పుట్టిన రోజు
అహో తన పల్లవి పాడే చల్లని రోజు

మాటా పలుకు తెలియనిది మాటున ఉండే మూగమది
కమ్మని తలపుల కావ్యమయే కవితలు రాసే మౌనమది
రాగల రోజుల ఊహలకి స్వాగతమిచ్చే రాగమది
శ్రుతిలయలెరుగని ఊపిరికి స్వరములు కూర్చే గానమది
ఋతువుల రంగులు మార్చేది కల్పన కలిగిన మదిభావం
బ్రతుకును పాటగా మలిచేది మనసున కదిలిన మృదునాధం
కలవని దిక్కులు కలిపేది నింగిని నేలకి దింపేది
తనేకదా వారధి క్షణాలకే సారథి మనస్సనేది
అహో ఒక మనసుకి నేడే పుట్టిన రోజు
అహో తన పల్లవి పాడే చల్లని రోజు

చూపులకెన్నడు దొరకనిది రంగూ రూపు లేని మది
రెప్పలు తెరవని కన్నులకు స్వప్నాలెన్నో చూపినది
వెచ్చని చెలిమిని పొందినది వెన్నెల కళగల నిండుమది
కాటుక చీకటి రాతిరికి బాటను చూపే నేస్తమది
చేతికి అందని జాబిలిలా కాంతులు పంచే మణిదీపం
కొమ్మల చాటున కోయిలలా కాలం నిలిపే అనురాగం
అడగని వరములు కురిపించి అమృత వర్షిణి అనిపించే
అమూల్యమైన పెన్నిది శుభోదయాల సన్నిది మనస్సనేది

అహో ఒక మనసుకి నేడే పుట్టిన రోజు
అహో తన పల్లవి పాడే చల్లని రోజు
ఇదే ఇదే కుహూ స్వరాల కానుక
మరో వసంత గీతిక జనించు రోజు

Share This :



sentiment_satisfied Emoticon