సులభ మార్గం

గోదావరి తీరాన పూర్వం విశ్వనాధుడనే పండితుడి
గురుకులం వుండేది. ఆ గురుకులంలో
విద్యార్ధులకు వేదాలు, ఉపనిషత్తులు,
ఇతిహాసాలు, సాహిత్యం.... ఇలా వివిధ
అంశాలు నేర్పేవారు. అందులో చేరే
బాలలు పదేల్లపాటు విద్యనభ్యసించాలి.
ఒక ఏడాది శ్రీనివాసుడనే విద్యార్ధి
విద్యాభ్యాసం కోసం గురుకులం లో చేరాడు.
ఇంట్లో గారాభంగా పెరగడం వల్ల శ్రీనివాసుడికి
ఆశ్రమంలో నియమాలు కష్టంగా తోచేవి.
తెల్లవారుజామున అయిదు గంటలకు లేచి
పాఠాలు వల్లెవేయాలంటే అతడికి నరకప్రాయంగా
ఉండేది. పదేల్లపాటు అలా చదవడం తనవల్ల అయ్యే
పని కాదనుకుని ఒకసారి విశ్వనాధుడి దగ్గరకు వెళ్ళి గురువుగారూ మీరు గొప్ప పండితుడని అంతా చెబుతారు మరి సులభంగా చదువు నేర్పే
మంత్రం ఏదైనా కనిపెట్టలేరా అని ప్రశ్నించాడు.
విశ్వనాధుడు అతణ్ణి క్షణకాలం పరీక్షగా చూసి
సరస్వతీదేవి అనుగ్రహం పొందాలంటే ఒక
మంత్రం ఉంది అన్నాడు. అయితే ఆ
మంత్రం నాకు ఉపదేశించండి అని
అడిగాడు శ్రీనివాసుడు.


విశ్వనాధుడు చిన్నగా నవ్వి
అలాగే ఉపదేశిస్తాను ఆ మంత్రాన్ని
ప్రతిరోజూ తెల్లవారుజామున
నాలుగు గంటలకు లేచి. చన్నీటి స్నానం చేసి
జపించాలి అలా పద్నాలుగేళ్ళు చేస్తే సరస్వతీదేవి కోరిన విద్యలను అనుగ్రహిస్తుంది. రేపు ఉదయాన్నే
నాలుగు గంటలకు స్నానం చేసి వస్తే ఆ
మంత్రాన్ని ఉపదేసిస్తాను అన్నాడు.
ఆ సమాధానానికి
శ్రీనివాసుడు బెదిరిపోయి గురువుకి నమస్కరించి
నాకు ఏ మంత్రమూ వద్దు గురువుగారూ అందరిలానే కష్టపడి విద్యను అభ్యసిస్తాను అని చెప్పి ఆ రొజు నుంచీ బుద్దిగా చదువుకొసాగాడు.
Share This :



sentiment_satisfied Emoticon