వెన్నెల లోనీ వికాసమే పాట లిరిక్స్ | ఆరాధన (1962)

 చిత్రం : ఆరాధన (1962)

సంగీతం : ఎస్. రాజేశ్వరరావు

సాహిత్యం : ఆచార్య ఆత్రేయ

గానం : సుశీల 


వెన్నెల లోనీ వికాసమే

వెలిగించెద నీ కనులా

వెన్నెల లోనీ వికాసమే

వెలిగించెద నీ కనులా

వేదన మరచి ప్రశాంతిగా

నిదురించుము ఈ రేయి

నిదురించుము ఈ రేయి


వెన్నెల లోనీ వికాసమే

వెలిగించెద నీ కనులా


వాడని పూవుల తావితో

కదలాడే సుందర వసంతమీ కాలము

కదలాడే సుందర వసంతమీ కాలము

చెలి జోలగ పాడే వినోద రాగాలలో

చెలి జోలగ పాడే వినోద రాగాలలో

తేలెడి కల సుఖాలలో

నిదురించుము ఈ రేయీ

నిదురించుము ఈ రేయీ


వెన్నెల లోనీ వికాసమే

వెలిగించెద నీ కనులా


భానుని వీడని చాయగా

నీ భావము లోనే చరింతునోయీ సఖ

నీ భావములోనే చరింతునోయీ సఖ


నీ సేవలలోనే తరింతునోయీ సదా

నీ సేవలలోనే తరింతునోయీ సదా

నీ ఎదలోనే వసింతులే

నిదురించుము ఈ రేయీ

నిదురించుము ఈ రేయీ


వెన్నెలలోనీ వికాసమే

వెలిగించెద నీ కనులా

వేదన మరచి ప్రశాంతిగా

నిదురించుము ఈ రేయి

నిదురించుము ఈ రేయి

నిదురించుము ఈ రేయి


Share This :
avatar

ఈ గీతాన్ని రాసిన వారు శ్రీశ్రీ గారు. ఆత్రేయగారు కాదు.

delete 2 September 2023 at 02:47
avatar

ఈ గీతాన్ని రాసింది శ్రీశ్రీ గారు. ఇది ఆత్రఎఅగారి రచన కాదు. దయచేసి సరిచేయగలరు

delete 2 September 2023 at 02:48



sentiment_satisfied Emoticon