ముత్యాల పందిరిలో సాంగ్ లిరిక్స్ ముద్దుల మేనల్లుడు (1990) తెలుగు సినిమా


Album : Muddula Menalludu

Starring: Nandamuri Balakrishna, Vijayashanti
Music : K. V. Mahadevan
Lyrics-Vennelakanti
Singers :Sp Balu, Chitra
Producer: S. Gopal Reddy
Director: Kodi Ramakrishna
Year: 1990English Script Lyrics CLICK HEREముత్యాల పందిరిలో
మురిపాల సందడిలో
మూడు ముళ్ళ మూర్తం
ఎప్పుడమ్మా ఓ చిలకమ్మ
ముద్దులన్ని పండేదెపుడెమ్మా

ముత్యాల పందిరిలో
మురిపాల సందడిలో
మూడు ముళ్ళ మూర్తం
ముందుంది ఓ చిన్నమ్మ
ముత్తైదు భాగ్యాలిస్తుంది

ఇది మొదలేనమ్మ
ముందు కధ ఉందో యమ్మ
తొలి రేయి లోన దోర వయసు
వాయనాలు ఇవ్వాలమ్మ

ముత్యాల పందిరిలో
మురిపాల సందడిలో
మూడు ముళ్ళ మూర్తం
ముందుంది ఓ చిన్నమ్మ
ముత్తైదు భాగ్యాలిస్తుంది

పసుపు పారాణి
బొట్టు కాటుక దిద్దిన
నా రాణి నాకే కానుక
మమతే మంత్రముగా మనసే సాక్షిగా
మాటే మనుగడగా మనమే పాటగా

సాగాలి జీవితము
చెప్పాలి స్వాగతము
నిండు నూరేళ్ళ మనువుగా
రాగాల శృంగారం
గారాల సంసారం
పండే వెయ్యేళ్లు మనవిగా
బుగ్గన చుక్కా వచ్చెనే
సిగ్గుల మొగ్గ విచ్చెనే
ఈ నిగ్గే పగ్గమేసి
నెగ్గెనమ్మ లగ్గమంటూ

ముత్యాల పందిరిలో
మురిపాల సందడిలో
మూడు ముళ్ళ
మూర్తం ముందుంది
ఓ చిలకమ్మా ముత్తైదు
భాగ్యాలిస్తుందీ

తేనెకు తీయదనం
తెలిపే ముద్దులో
వయసుకు వెచ్చదనం
తెలిసే పొద్దులో
కలలకు కమ్మదనం
కలిగే రేయి లో
వలపుల మూల ధనం
పెరిగే హాయిలో
అందాల వెల్లువలో
వందేళ్ళ పల్లవులే
పాడే పరువాలే తోడుగా
వెయ్యాలి కూడికలు
వెయ్యేళ్ల వేడుకలు
వేడిగా విరహాలె వీడగా
గాజుల వీణ మీటగా
జాజుల వాన చాటుగా
ఈ కొంగు కొంగు కూడే
రంగ రంగ వైభవం గా 

ముత్యాల పందిరిలో
మురిపాల సందడిలో
మూడు ముళ్ళ మూర్తం ముందుంది 
ఓ చిన్నమ్మ ముత్తైదు భాగ్యాలిస్తుంది

ముత్యాల పందిరిలో
మురిపాల సందడిలో
మూడు ముళ్ళ మూర్తం
ఎప్పుడమ్మా ఓ చిలకమ్మ
ముద్దులన్ని పండేదెపుడెమ్మా

Share This :sentiment_satisfied Emoticon