నా తోడువై..నా నీడవై సాంగ్ లిరిక్స్ తోడు నీడ (1983) తెలుగు సినిమా


Album : Thodu Needa

Starring: Sobhan Babu, Radhika, Saritha, Nalini
Music : Chakravarthi
Lyrics-Acharya Atreya 
Singers :SP Balu, Suseela
Producer: S. P. Venkkanna Babu
Director: V. Janardhan

Year: 1983English Script Lyrics CLICK HEREనా తోడువై..నా నీడవై
నా లాలన నా పాలన
నా జీవన జీవం నీవై
నా స్వర్గం నీ తోనే
నా సర్వం నీ లోనే
చూస్తున్న నేనే నీవై

నా తోడువై... నా నీడవై
నా లాలన నా పాలన
నా జీవన జీవం నీవై
నా స్వర్గం నీ తోనే
నా సర్వం నీ లోనే
చూస్తున్న నేనే నీవై

నీ రూపం కలకాలం
నా ఏదలొ కదలాడే
అపురూప అనురాగ దీపం
నీ నవ్వుల సిరి మువ్వల
చిరునాదం
ప్రతి ఉదయం వినిపించు
భూపాల రాగం
మన లోకం.. అందాల లోకం
మన గీతం.. ఆనంద గీతం
మన బ్రతుకు తుది లేని
సెలయేటి గానం

నా తోడువై.. నా నీడవై
నా లాలన నా పాలన
నా జీవన జీవం నీవై
నా స్వర్గం నీ తోనే
నా సర్వం నీ లోనే
చూస్తున్న నేనే నీవై

నీ చెంపల ఎరుపెక్కే
నును కెంపుల సొంపులలో
పూచింది మందార కుసుమం
నీ మమతలు విరజల్లే
విరి తేనెల మదురిమలో
విరిసింది నవ పారిజాతం

నీ రాగం...అతిలోక బందం
నీ స్నేహం...ఎనలేని దాహం
అనుదినము ఒక అనుభవం
రసమయ సంసారం

నా తోడువై.. నా నీడవై
నా లాలన నా పాలన
నా జీవన జీవం నీవై
నా స్వర్గం నీ తోనే
నా సర్వం నీ లోనే
చూస్తున్న నేనే నీవై 
Share This :sentiment_satisfied Emoticon