తొలి వలపే తీయనిది సాంగ్ లిరిక్స్ యువరాజు (2000) తెలుగు సినిమాStarring: Mahesh Babu, Simran Bagga,Sakshi Shivanand
Music: Ramana Gogula
Lyrics-Veturi
Singers : Hariharan, Chitra
Producer:Burugapally Sivarama Krishna
Director:Y.V.S.Chowdary
Year: 2000


తొలి వలపే తీయనిది ఆ దాహం తీరనది
కాలంలా కరిగిపోనిది ప్రాణంలా తిరిగిపోదది
తొలి వలపే తీయనిది ఆ దాహం తీరనది

వేదంలాగ లిపి లేనిది ... వేధిస్తున్న సుఖమైనది
ఓడిస్తున్న గెలుపే అది ... ఓదార్చె ఓ పిలుపైనది
చుక్కలనె నిలుపునది ... దిక్కులనె కలుపునది
ఆకాశం తానై ఉన్నది

ఒక్కరిలో ఇద్దరది ఇద్దరిలో ఒక్కటది
నీకోసం నేనై ఉన్నది
తొలి వలపె ... ఆ బాధే ... 

గుండెల్లోన గూడె ఇది ... గుచ్చే రోజామాలే అది
మాటల్లోన మౌనం అది ... మనసుల్లోన ధ్యానం అది
యే రుణమో తెలియనిది ... యే వరము అడగనిది
యే మజిలి చేరేనో అది

ఎప్పటిదో యెరుగనిది ఎన్నటికి మరువనిది
ఓ కధల చేరే కంచికి
తొలి వలపె తీయనిది ... ఆ బాధే తీరనది
యెదకన్న లోతుగుంటది ... బ్రతుకల్లె తోడు ఉంటది

Share This :sentiment_satisfied Emoticon