ఓ ఆగి ఆగి సాగే మేఘమేదో సాంగ్ లిరిక్స్ ఈ నగరానికీ ఏమైంది (2018) తెలుగు సినిమా20



Starring: Vishwak Sen, Sai Sushanth, Abhinav Gomatam, 
Venkatesh Kakumanu, Anisha Ambrose, Simran Chowdary
Music : Vivek Sagar
Lyrics-Krishna Kanth 
Singers :Anurag Kulkarni and Manisha Eerabathini
Producer:Suresh Babu
Director:Tharun
Year: 2018




ఓ ఆగి ఆగి సాగే మేఘమేదో
నన్ను తాకేనా.. ఒక్కసారే
నేల వీడి కాళ్లు నింగిలోకి తేలేనా

ముందులేని ఊహలేవో రాలేను చినుకులాగా
అంతసేపు ఊపిరాగగా
ఆ ఆపైనే మరో తీరం నే చేరగా
ఆశేమో వదిలి దూరం నిజం అయ్యే క్షణం

ఓపలేని వేసవేదో వేలు తాకగా
ఓ కాగితాన నేను రాయగా అదే క్షణాన

ఇదేది ముందు చూడనంత కన్నుల్లో సంబరంలా
మరెంత ఉన్న చాలనంత బంధించే పంజరంలా
నీశీధి దారిలోన ఎండే
ముఖాన్ని తాకుతూనే ఉండే
ఉండే రాగరూపం
నాపైన ఓ పూల వాన ఆ చూపేనా ఓ ఓ
ఆపేనా నే తీసుకోగా ఊపిరైనా 
ఓసారి వచ్చిందే
నా గుండెలోరి గుండెపోటులా

ఓ ఆపైన మరో తీరం నే చేరగా
అశేమో వదిలి దూరం నిజం అయ్యేం క్షణం
రమారమీ జీవితం అమాంతమే మరీ
స్నేహం అనే మారుతం ఇటువైపుగా వీచే
మీరు మెల్లంగా నీవు అయ్యేనా
ఇంకేదైనా పేరుందా
కాలమేమో వేడుకున్నా ఆగదు
వేళ్లమీద వీగిపోగా
నీ తోడులేక కాస్తయినా కదులదు
తనుంటే అంతేలే
ఇంకేది గుర్తు రాని వేలలో

పోతుంది కరిగే దూరం ఆ జంట నడుమ
పెంచావు యదలో వేగం యే యే
అవుతుంది త్వరగా గారం నీ కంట పడినా
తెంచావు దిగులు దారం నీ వే

ఓ ఆగి ఆగి సాగే మేఘమేదో
నన్ను తాకేనా.. ఒక్కసారే
నేల వీడి కాళ్లు నింగిలోకి తేలేనా

ఓ అంతే లేని సంతోషాలే
వంతే పాడి వాలేలే
బాధే చేరే వీలింకా లేనే లేదే
తోడే ఉంటే మేలే

అంతే లేని సంతోషాలే
వంతే పాడి వాలేలే
నీడే తీసే రాగాలు మేలే మేలే
వచ్చే లేని ప్రేమే

Share This :



sentiment_satisfied Emoticon