అంతఃపురం లో అందాల చిలకా సాంగ్ లిరిక్స్ రుద్రమదేవి (2015) తెలుగు సినిమా


Starring:Allu Arjun, Anushka Shetty, Rana Daggubati
Music:Ilaiyaraaja
Lyrics-Sirivennela Sitaramasastri
Singers :Chithra, Sadhana Sargam, Chinmayee
Producer:Gunasekhar
Director:Gunasekhar
Year: 2015

అంతఃపురం లో అందాల చిలకా
సందేహమేలనే అంతగా
అంబరమేలగా అడ్డు ఎవరు నీకిక
చుక్కల్ని తాకే రెక్కల్ని తొడిగా
రివ్వంటు రావే స్వేచ్చగా
అద్దాల మేడలో పొద్దు గడపకే ఇక
అల్లదే వేచి ఉన్నదే వేడుకైన వేదిక 
వెల్లువై పొంగుతున్నదే వేల పూల వాటిక
ఇల్లారా అన్నదే విరుల వీచిక
అంతఃపురం లో అందాల చిలకా
అంతఃపురం లో అందాల చిలకా

రేయి వెనకాల 
రాని కునుకేల
వెలికి రా శశికళా
జలతారు ముసుగేల 
చిలిపి జలకాల
మునిగి పోదాం హలా
పరదాలు పహరాలు దాటి పోవాలి ఆగిపోకలా
వాయువేగాన సాగి పోవాలి అన్నివైపులా
పెట్టేదెవరట కలలకు కాపలా
పట్టే్దెవరట ఉరికిన ఊహలా
కట్టేదెవరు మనసు సయ్యాటలా
అంతఃపురం లో అందాల చిలకా
అంతఃపురం లో అందాల చిలకా


గాలి గిలిగింత పూల పులకింత
తనువు అణువణువునా    
సిరికొత్త కవ్వింత కొంటె కేరింత
మదికి విన్నవించెనా
నీలాల నయనాల వెల్లి విరిసేను మెరుపు మిలమిలా
అహ .. పాల కెరటాల ఊయలూగెను ఊపిరే ఇలా
ఏదో మధురిమ మనకది తెలిసెనా
ఏదో సరిగమ మననటు పిలిచెనా
ఏవో సుధలు చిలుకు ఆలాపన

అంతఃపురం లో అందాల చిలకా
సందేహమేలనే అంతగా
అంబరమేలగా అడ్డు ఎవరు నీకిక
చుక్కల్ని తాకే రెక్కల్ని తొడిగా
రివ్వంటు రావే స్వేచ్చగా
అద్దాల మేడలో పొద్దు గడపకే ఇక
అల్లదే వేచి ఉన్నదే వేడుకైన వేదిక 
వెల్లువై పొంగుతున్నదే వేల పూల వాటిక
ఇల్లారా అన్నదే విరుల వీచిక
అంతఃపురం లో అందాల చిలకా
అంతఃపురం లో అందాల చిలకా
Share This :sentiment_satisfied Emoticon