రా రాకుమారా రాజసాన ఏలగా సాంగ్ లిరిక్స్ గోవిందుడు అందరివాడేలే (2014) తెలుగు సినిమా


Starring:Ram Charan, Kajal Aggarwal
Music:Yuvan Shankar Raja
Lyrics-Sirivennela Sitaramasastri
Singers :Chinmayi
Producer:Ganesh Babu
Director:Krishna Vamsi
Year: 2014






రా రాకుమారా రాజసాన ఏలగా
యెదపై చేరనీరా పూలమాలే నేనుగా
నీవు తీసే శ్వాసలో ఊయలూగే ఆశతో
పంపుతున్నా నా ప్రాణాన్నే నీ వైపుగా..


నీ తలపులతో మరిగిపోయే ఒంటరితనము ఇష్టమే
నీ కబురులతో కరిగిపోయే ప్రతి ఒక క్షణము ఇష్టమే
కలలే నిజమయేలా కళ్ళు తెరిచిన కోరిక ఇష్టం
నిజమే కల అయేలా ఒళ్ళు మరచిన అయోమయం మరింత ఇష్టం

రా రా రాకుమారా రాజసాన ఏలగా
యెదపై చేరనీరా పూలమాలే నేనుగా..

బరువనిపించే బిడియమంతా నీ చేతులలో వాలనీ
బతకడమంటే ఎంత మధురం నీ చేతులలో తెలియనీ
నేనేం చేసుకోను నీకు పంచని ఈ హృదయాన్ని
ఇంకేం కోరుకోను నిన్ను మించిన మరో వరం ఏదైన గానీ..
ఆ ఆ ఆ... ఆ ఆ ఆ ఆ ఆ.....
Share This :



sentiment_satisfied Emoticon