తొలిసారి ముద్దివ్వమంది సాంగ్ లిరిక్స్ ఎదురీత (1975) తెలుగు సినిమా


Album : Edureeta

Starring:N. T. Rama Rao, Vanisri
Music :Satyam
Lyrics-Veturi 
Singers:SP Balu, P. Susheela
Producer:Sakhamuri Ramachandra Rao
Director:. Madhusudhan Rao
Year: 1975

తొలిసారి ముద్దివ్వమంది
చెలి చిరుకాటు ఈ తేనెటీగ 
బుగ్గ చేమంతి మొగ్గ
పెదవులలో మధువులనే కోరి కోరి చేరి
ఒకసారి రుచి చూడమందీ
నీ పైట తీసి కప్పుకుంది ఆకాశం
తెరచాటు సొగసు లారబోసి నాకోసం
నీ చూపులు సోకి సొగసు వెల్లువలాయె
నీ ఊపిరి తాకి మనసు వేణువులూదె ||తొలిసారి||
నీ మనస్సు విప్పి చెప్పమంది మధుమాసం
సిరి మల్లెపూలు గుప్పుమంది నీ కోసం
నీ నవ్వులలోనే వలపు గువ్వల సాగె
నీ నడకలలోనే వయసు మువ్వలు మోగె ||తొలిసారి||
ఈ రేయి హాయి మోయలేను ఒంటరిగ
ఇక రేపు మాపు తీపి వలపు పంటలుగ
నులి వెచ్చన కాదా మనసిచ్చిన రేయి
తొలి మచ్చికలోనే సగమిచ్చిన హాయి
తొలిసారి ముద్దివ్వమంద్ద.. చెలిబుగ్గ చేమంతిమొగ్గ



Share This :



sentiment_satisfied Emoticon